Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత!

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత!

Alla Nani Passes Away | ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నాని, ఆ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన డిప్యూటీ సీఎంగా సేవలందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన అకాల మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, మద్దతుదారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions