Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తాజా > మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

Manchu Lakshmi Adopts Schools In Telangana | ప్రముఖ నటి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు మంచు లక్ష్మి వచ్చారు.

టీచ్ ఫర్ చేంజ్ ( Teach For Change ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ( Digital )తరగతులు, మౌలిక సదుపాయాలకు ఆమె కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు సోమవారం మంచు లక్ష్మి గద్వాల్ వెళ్లారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గట్టు మండలంలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్మాణం చేసినట్లు, అలాగే మరో 20 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.

అక్షరాస్యతలో వెనుకబడిన గట్టు ప్రాంతాన్ని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తామని లక్ష్మీ హామీ ఇచ్చారు. ఆమె చర్యలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions