Sunday 13th July 2025
12:07:03 PM
Home > తాజా > నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

Naga Chaitanya-Sobhitha Wedding | టాలీవుడ్ ( Tollywood ) ప్రముఖ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలయ్యాయి.

చైతన్య శోభితా చాలా కాలం మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితో ఆగస్ట్ 8న వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో జరిగింది. అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) నివాసంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీఠలు ఎక్కనున్నారు. తాజాగా పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. పసుపు దంచుతున్న ఫోటోలను శోభితా సోషల్ మీడియా ( Social Media ) ద్వారా షేర్ చేశారు.

గోధుమరాయి పసుపు దంచటంతో పెళ్లి పనులు మొదలయ్యాయి అంటూ శోభితా కాప్షన్ ( Caption ) ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుంది అంటూ అభిమానులు అడుగుతున్నారు.

You may also like
‘ఆదర్శ ఘటన..తల్లీ నీకు వందనం’
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సీఎం
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..కాల్పుల కలకలం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions