Chandrababu Narrowly escaped a potential Train accident | సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
విజయవాడ ( Vijayawada ) మధురానగర్ లో వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉదృతుని పరిశీలించేందుకు రైలు వంతెన పైకి సీఎం ఎక్కారు.
బ్రిడ్జి పైనుండి బుడమేరు ( Budameru ) ఉధృతిని పరిశీలించారు. అయితే చంద్రబాబు రైలు వంతెన పై ఉన్న సమయంలోనే ఎదురుగా రైలు వచ్చింది.
దింతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయింది. రైలు తగలకుండా సీఎం మరియు సిబ్బంది ఓ పక్కకు నిలబడి నిల్చున్నారు. పెను ప్రమాదం తప్పడంతో రైలు వెళ్ళిపోయాక అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.