Helicopter Lands In Agricultural Fields In Chityala | అనూహ్యంగా ఓ హెలికాప్టర్ ( Helicopter ) పంట పొలాల్లో ల్యాండ్ అవడంతో స్థానికులు అయోమయానికి గురయ్యారు.
ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల ( Chityala ) మండలం వనిపాకల లో చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని పంట పొలాల్లో గురువారం ఉదయం ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
విజయవాడ ( Vijayawada ) వరద బాధితుల సహాయక చర్యల కోసం జైపూర్ ( Jaipur ) నుండి పలు హెలికాప్టర్లు ఏపీకి వచ్చాయి. తిరిగి వెళ్లే క్రమంలో సాంకేతిక లోపం ( Technical Issue ) కారణంగా అనూహ్యంగా హెలికాప్టర్ పొలాల్లో ల్యాండ్ కావాల్సివచ్చింది.
పైలట్ సహా, ఇతర సిబ్బంది సురక్షితం ఉన్నారు. సమాచారం అందుకుని మరో హెలికాప్టర్ లో సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో రెండు హెలికాఫ్టర్లు పొలాల్లో ల్యాండ్ అవ్వడంతో చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.