Heroines Did Not Contribute To Flood Victims | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ప్రముఖ నటులు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళం ప్రకటించారు.
మరోవైపు తెలుగు నటీమణి అనన్య నాగళ్ల కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల విరాళం అందజేశారు. కానీ, తెలుగు పరిశ్రమలో పెద్ద సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే ముంబై, కన్నడ, మలయాళీ, తమిళ హీరోయిన్లు బాధితులకు అండగా నిలిచేందుకు ఇప్పటివరకు ముందుకు రాలేదు.
తెలుగు సినిమాల్లో అత్యధికంగా బయటి హీరోయిన్లే నటిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ‘ఐ లవ్ తెలుగు ఆడియన్స్’ అని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పే హీరోయిన్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాలల్లో ఉన్న సమయంలో సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
ఇప్పటికైనా తెలుగు అమ్మాయిలనే హీరోయిన్ల పాత్రలకు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.