Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఓటమిని ముందే ఊహించిన పినరయి విజయన్?

ఓటమిని ముందే ఊహించిన పినరయి విజయన్?

kerala cm vijayan fires on telangana government

‌- బయోలో ‘సీఎం’ హోదా తొలగింపు..
– కేరళలో కాంగ్రెస్ కూటమి జోరు!

Pinarayi Vijayan changes bio on X | కేరళ శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం ఈసారి ఘోర పరాజయం దిశగా వెళ్తోంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి భారీ మెజారిటీతో అధికారం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కేరళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఓటమిని ముందే ఊహించినట్లు తెలుస్తోంది.

90కి పైగా స్థానాల్లో యూడీఎఫ్ లీడింగ్..
కేరళలోని మొత్తం 140 శాసనసభ స్థానాల్లో.. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ ఏకంగా 90కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారం చేపట్టడానికి అవసరమైన 71 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా దాటేసింది.

40 స్థానాలకే పరిమితమైన ఎల్డీఎఫ్..
మరోవైపు అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 40 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండి చతికిలపడింది. ఫలితాల సరళిని విజయన్ ముందుగానే అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం సాయంత్రం ఆయన తన అధికారిక సోషల్ మీడియా బయోలో కీలక మార్పులు చేశారు.

మొన్నటివరకు కేరళ ముఖ్యమంత్రి అని ఉన్న బయోను తొలగించి, ‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు’గా మార్చుకున్నారు.

మరోవైపు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పుడు మార్చి నెలలోనే ఈ బయో మార్పు జరిగిందని కొందరు వాదిస్తున్నప్పటికీ, కౌంటింగ్ రోజున ఈ బయో మార్పు అంశం మరోసారి ఇరు పార్టీల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions