Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడులో విజయ్ సునామీ.. మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో టీవీకే!

తమిళనాడులో విజయ్ సునామీ.. మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో టీవీకే!

  • టెంట్లు తొలగిస్తున్న అధికార పార్టీ కార్యకర్తలు!

Vijay TVK leads DMK | తమిళనాడు శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో సరికొత్త ప్రభంజనం సృష్టిస్తున్నారు.

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ.. అధికార డీఎంకే (DMK) కూటమికి గట్టి షాక్ ఇస్తూ దూసుకుపోతోంది.

100కు పైగా స్థానాల్లో టీవీకే ముందంజ..
ఉదయం 10:30 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.

టీవీకే జోరుతో అధికార డీఎంకే శ్రేణులు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని భావించి చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సంబరాల కోసం వేసిన టెంట్లను, ఇతర ఏర్పాట్లను కార్యకర్తలు నిరాశతో తొలగిస్తున్నారు.

వెనుకంజలో సీఎం స్టాలిన్, 26 మంది మంత్రులు..
ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని 26 మంది మంత్రులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్లు ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూ తిరిగిన తమిళనాడు రాజకీయం.. విజయ్ సునామీతో సరికొత్త మలుపు తిరిగినట్లయింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions