Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘మైసా’ గా రష్మీక మందన్న..ఫస్ట్ లుక్ వైరల్ !

‘మైసా’ గా రష్మీక మందన్న..ఫస్ట్ లుక్ వైరల్ !

Rashmika Mandanna New Movie Poster | మునుపెన్నడూ చూడని పాత్రలో నటి రష్మీక మందన్న కనిపించనున్నారు. ఇటీవలే ‘కుబేర’ తో విజయాన్ని అందుకున్న రష్మీక తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.

‘మైసా’ అనే ప్రాజెక్టుతో త్వరలోనే రష్మీక అలరించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల అయ్యింది. ఇప్పటి వరకు బ్యూటీ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రష్మీక ఇందులో మాత్రం భయంకరమైన వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చుస్తే అర్ధం అవుతుంది.

‘మైసా’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. ఐదు భాషల్లో దీనిని రూపొందించనున్నారు. రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని అన్ ఫార్ములా బ్యానర్ పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్నారు.

‘ధైర్యంతో పెరిగింది. అచంచలమైన సంకల్పం. ఆమె గర్జిస్తుంది. కానీ వినబడటానికి కాదు, భయపడేలా చేయడానికి’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

You may also like
సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి.. స్పందించిన ముఖ్యమంత్రి!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions