Monday 3rd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్ రెండవ పెళ్లి

అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్ రెండవ పెళ్లి

Jeff Bezos and Lauren Sanchez are now married | ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు, మాజీ న్యూస్ యాంకర్ 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ ను వివాహం చేసుకున్నారు.

ఇటలీలోని వెనిస్ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది. వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో, గ్రాండ్ కెనాల్‌పై ఉన్న 16వ శతాబ్దానికి చెందిన అమన్ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది.

ఈ వేడుక మూడు రోజులపాటు జరిగగా, రూ.4 వేల కోట్లకు పైగా విలువైన జెఫ్ బెజోస్ యొక్క సూపర్ యాచ్ “కొరు”పై కూడా కొంతభాగం వివాహ వేడుకను నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే, జోర్డాన్ రాణి రానియా, ఓర్లాండో బ్లూమ్, టామ్ బ్రాడీ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

సుమారు 200 మంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, గ్లోబల్ లీడర్స్ ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను లారెన్ శాంచెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

తన ఖాతాలో గత పోస్టులను డిలీట్ చేసి కేవలం ఈ పెళ్లికి సంబంధించిన రెండు పోస్టులనే ఉంచారు. జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. 2019లో బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్‌తో 25 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions