Man Lost His Life After Saving Four Others During Vijayawada Floods | విజయవాడలో వరదల కారణంగా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.
సోదరులను సురక్షిత ప్రాంతానికి తరలించి, మూగ జీవులనూ సైతం రక్షించి తనను తాను మాత్రం కాపాడుకోలేకపోయాడు ఓ వ్యక్తి.
బెజవాడకు చెందిన చంద్రశేఖర్ ( Chandrashekar ), సింగ్ నగర్ ( Singh Nagar ) లో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం అనూహ్యంగా వరదలు పోటెత్తాయి. ఈ సందర్భంగా అదే డైరీ ఫార్మ్ ( Dairy Farm ) లో పనిచేసే సోదరులను రక్షించి, డైరీ ఫార్మ్ షెడ్ ( Shed ) పైకి ఎక్కించాడు.
అనంతరం తాళ్లతో కట్టివేసిన ఆవులను విడిపించి వాటి ప్రాణాలను కాపాడాడు. కానీ అతను మాత్రం షెడ్ ఎక్కబోయి దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయాడు.
డైరీ ఫార్మ్ కు సుమారు 500 మీటర్ల దూరంలో మంగళవారం చంద్రశేఖర్ మృతదేహం లభించింది. దింతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చంద్రశేఖర్ భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి.