Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

Jitta Balakrishna Reddy Passes Away | బీఆరెస్ నాయకుడు, మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ( Jitta Balakrishna Reddy ) శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ( Brain Infection ) తో బాధపడుతున్న జిట్టా గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరి ( Bhuvanagiri )కి తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణ శివారులోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న ఫార్మ్ హౌస్ ( Farm House ) లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గతంలో బీఆరెస్ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, 2009లో టికెట్ రాకపోవడంతో గులాబీ పార్టీ నుండి బయటకు వచ్చారు.

అనంతరం ఇండిపెండెంట్ ( Independent ) గా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి, నెల రోజుల వ్యవధిలోనే తిరిగి బీఆరెస్ లోకి వెళ్లారు.

సుమారు 14 ఏళ్ల తర్వాత సొంతగూటికి చేరిన జిట్టా బాలకృష్ణా రెడ్డి ఇంతలోనే అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions