Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > బాలయ్య వారసుడొచ్చాడు

బాలయ్య వారసుడొచ్చాడు

Nandamuri Mokshagna | నందమూరి ( Nandamuri )అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ ( Balakrishna )తనయుడు మోక్షజ్ఞ ( Mokshagnya ) టాలీవుడ్ ( Tollywood ) లోకి ఎంట్రీ ఇచ్చారు. హనుమాన్ ( Hanuman ) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) బాలయ్య తనయుడ్ని వెండితెరకు పరిచయం చేయనున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ( PVCU ) లో భాగంగా ‘ సింబా ఈజ్ కమింగ్ ‘ ( Simba Is Coming ) అంటూ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ( First Look ) పోస్టర్ ను ప్రశాంత్ వర్మ శుక్రవారం విడుదల చేసారు.

మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ తెలియజేస్తున్నారు.

ఫస్ట్ లుక్ సందర్భంగా, ‘ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజా ‘ ను పరిచయం చేయనున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. తనపై నమ్మకం పెట్టుకున్న బాలకృష్ణకు డైరెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

You may also like
balayya babu
నామినేషన్ వేసిన బాలకృష్ణ.. ఆస్తులు, అప్పులు ఎంతంటే?
పొరపాటు జరిగింది.. మన్నిస్తారని ఆశిస్తున్నా: బాలయ్య బాబు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions