Nandamuri Family | నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా పరిచయం అవుతున్నాడు.
న్యూ ట్యాలెంట్ రోర్స్ (New Talent Roars) బ్యానర్ పై యలమంచలి గీత నిర్మాణంలో వైవిఎస్ చౌదరి (YVS Chowdary) దర్శకత్వంలో ఈ తారక రామారావు నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణారావు (Veena Rao) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్బంగా సినిమా ఓపెనింగ్ కి దాదాపుగా నందమూరి ఫ్యామిలీ అంతా హాజరైంది.
సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్ కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు, మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.
వీరంతా కలిసి మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో ఫోటో దిగారు. నందమూరి కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫ్యామిలీ ఫోటో (NTR Family Photo) వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ యువ తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు.
