Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో చివరి రెడ్డి సీఎం ఈయనే.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో చివరి రెడ్డి సీఎం ఈయనే.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు!

teenmar mallanna

Teenmar Mallana | తెలంగాణలో బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేయకపోతే ఒక్కరు కూడా గెలవరని తెలిపారు. తనకు పార్టీ పదవులు లెక్క కాదని అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతుందని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు కేవలం బీసీలు మాత్రమే ఓట్లు వేయాలని రెడ్లు, ఓసీలు తనకు ఓటు వేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశాడు తీన్మార్ మల్లన్న.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలదేనన్నారు. 2028లో బీసీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions