Harish Rao Satires On Congress | కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే ఆపన్న హస్తమా? భస్మాసుర హస్తమా? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి ఎద్దేవా చేశారు. తమది తెలంగాణ భవన్ కాదు.. ఇకపై ప్రజా భవన్ అని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తెలంగాణ భవన్ కు రావాలని హైడ్రా, మూసీ బాధితులను కోరారు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని బాంబ్ పేల్చారు.
సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉందన్నారు. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉందన్నారు. ముందు వాళ్ల ఇండ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.