GHMC Commissioner Amrapali | హైదరాబాద్ లో హైడ్రా (Hydraa) కూల్చివేతల వివాదం చెలరేగుతున్న తరుణంలో తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆమ్రపాలి (Amrapali Reddy) సంచలన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు బ్యాన్ చేస్తూ ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాల్ పోస్టర్లతో పాటు వాల్ పెయింటింగ్స్‌పై కూడా సీరియస్‌గా వ్యవహరించాలని కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు.
చివరికి సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా గోడలకు పోస్టర్లు అతికించకుండా నిషేధించాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. గోడలపై ఎవరైనా పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆమ్రపాలి ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సీరియస్‌గా అమలు చేయాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.