Thursday 30th July 2026
12:07:03 PM
Home > తాజా > హైడ్రా కమిషనర్ కు హైకోర్టు కీలక ఆదేశాలు!

హైడ్రా కమిషనర్ కు హైకోర్టు కీలక ఆదేశాలు!

telangana high court

High Court Order To Hydraa | హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను, ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ (Buffer Zone) లలో కట్టడాలను గత కొద్ది రోజులుగా హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నివాస గృహాలను కూడా హైడ్రా కూల్చేసిందే.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌‌కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 30న  ఉదయం 10.30 గంటలకు కోర్డు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఇటీవల అమీన్‌పూర్‌లో హైడ్రా ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది.

కాగా, ఆ భవనంపై కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం మీద.. వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్‌గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని ఆదేశించింది. 

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
vc sajjanar
బలవంతంగా రంగులు పూస్తే.. సజ్జనర్ వార్నింగ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions