Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇవన్నీ కలిస్తే ‘పవనిజం’..పవన్ కు సీఎం బర్త్ డే విషెస్

ఇవన్నీ కలిస్తే ‘పవనిజం’..పవన్ కు సీఎం బర్త్ డే విషెస్

CM Chandrababu greet Pawan Kalyan on birthday | జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

‘మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాల్లో విలువలకు పట్టం స్పందించే హృదయం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి, మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పారు.

‘జన్మదిన సందేశంతో పాటుగా, మీ మాటలతో ఆత్మీయతను చాటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు. సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన మీ నాయకత్వంలో, మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా పయనించడం సంతోషంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions