Upasana Konidela Peddi Celebrations | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే ఈ సినిమా హిస్టారికల్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.
ఈ క్రమంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల థియేటర్‌లో చేసిన సందడి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఉదయం హైదరాబాద్ బాలానగర్‌లోని ఒక ప్రముఖ థియేటర్‌లో జరిగిన ‘పెద్ది’ స్పెషల్ ప్రీమియర్ షోకు ఉపాసన కొణిదెల హాజరయ్యారు.
స్క్రీన్ పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఉపాసన థియేటర్ లోని అభిమానులతో కలిసిపోయారు. సీట్లోంచి లేచి నిలబడి ఈలలు వేస్తూ, గోల చేస్తూ, పేపర్లు విసిరేస్తూ ఎంతో ఉత్సాహంగా సందడి చేశారు.
సాధారణంగా చాలా సైలెంట్ గా ఉండే ఉపాసన.. ఒక పక్కా మాస్ మెగా అభిమానిలా మారిపోయి పేపర్లు ఎగరేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
టాక్ విషయానికి వస్తే ‘పెద్ది’ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని, ఆయన వన్ మ్యాన్ షోతో సినిమాను నడిపించారని ఫ్యాన్స్ చెప్తున్నారు.
అలాగే జగపతిబాబు క్యారెక్టర్ సినిమాకు లార్జర్ ద్యాన్ లైఫ్ హైలైట్ గా నిలిచిందని టాక్ వస్తోంది. చాలా కాలం తర్వాత థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.







