Sunday 3rd May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పులివెందులలో ఉప ఎన్నికలు..అవినాష్ రెడ్డి అరెస్ట్

పులివెందులలో ఉప ఎన్నికలు..అవినాష్ రెడ్డి అరెస్ట్

YS Avinash Reddy Arrest News | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు మంగళవారం పోలింగ్ మొదలయ్యింది.

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా అవినాష్ రెడ్డి అరెస్టుపై వైసీపీ స్పందించింది. ఇది అక్రమ అరెస్ట్ అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అవినాష్ కు కనీసం చెప్పులు కూడా వేసుకునే సమయం ఇవ్వలేదని పోలీసుల తీరుపై జగన్ పార్టీ మండిపడింది. కూటమి ప్రభుత్వ రిగ్గింగ్ కు అడ్డుపడుతాడనే భయంతోనే పోలింగ్ ముంగిట అవినాష్ ను అరెస్ట్ చేశారని వైసీపీ పేర్కొంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions