Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్

బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్

Telangana BJP Chief Ramchander Rao Placed Under House Arrest | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు.

కొద్దీ రోజుల క్రితం ఓ దుండగుడు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర బీజేపీ నేతలు ఆ ఆలయంలో కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. దింతో పోలీసులు రామచందర్ రావును గృహ నిర్బంధం చేశారు.

కాగా హౌస్ అరెస్ట్ పై బీజేపీ చీఫ్ స్పందించారు. నిజాం పాలనలో జరిగిన నిరంకుశత…ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో పునరావృతం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాన్ని అపహరించి, బోనాలు పగలగొట్టి, హిందువులను చిత్రహింసలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అమ్మవారికి పూజలు చేయనివ్వకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు.

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కాపాడుకునేందుకు బిజెపి – హిందూ సమాజం సాగించిన ఉద్యమం విజయవంతమై, అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగిందని భరించలేక, తమ ఓటమిని – హిందువుల విజయాన్ని ఓర్వలేక, తిరిగి హిందూ ఆరాధనపై ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions