Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR serves defamation notice to Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అడ్డగోలుగా అసత్య పూరితంగా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య పూరిత ఆరోపణలు చేయడం దుర్మార్గం మని కేటీఆర్ తరఫు న్యాయవాదులు నోటీసులో తెలిపారు.

కేవలం రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్‌ పైన అసత్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో అడ్డగోలు అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. లేకుంటే తదుపరి లీగల్ నోటీస్‌తో పాటు చట్టంలో అందుబాటులో ఉన్న క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యుడు అవుతారని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ ఆగస్ట్ 8న సిట్ విచారణకు హాజరైన విషయం తెల్సిందే. అనంతరం బండి మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions