Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > భారీ వర్షాలు.. 72 గంటలుఅప్రమత్తంగా ఉండాలి!

భారీ వర్షాలు.. 72 గంటలుఅప్రమత్తంగా ఉండాలి!

Rain Alert

Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Telangana Rains) ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధ గురు వారాల్లో రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, అనేక జిల్లాలకీ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్, రేపు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుంది.

భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 72 గంటలపాటు రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వర్షాల ప్రభావంతో ఐదు జిల్లాల్లో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.  

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions