Tuesday 16th June 2026
12:07:03 PM
Home > క్రైమ్ > సచివాలయంలో ‘రీల్స్’ పోలీస్ అరెస్ట్.. అసలు గుట్టు విప్పిన సైఫాబాద్ పోలీసులు!

సచివాలయంలో ‘రీల్స్’ పోలీస్ అరెస్ట్.. అసలు గుట్టు విప్పిన సైఫాబాద్ పోలీసులు!

Fake Police Arrested | తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో పోలీస్ వేషధారణతో హల్ చల్ చేసిన ఓ వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అపాయింట్‌మెంట్ లేకుండానే నేరుగా కలిపిస్తానని ప్రజలను నమ్మబలికిన ఈ ‘ఫేక్’ పోలీస్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

రామంతపూర్‌కు చెందిన తాటూరి రవి అలియాస్ చరణ్ యాదవ్, గోషామహల్‌లోని ఒక క్యాంటీన్‌లో పనిచేసేవాడు.

అక్కడ పోలీసుల పనితీరును, వారి అధికారాన్ని చూసి ఆకర్షితుడైన రవి, తాను కూడా ఒక పోలీసునని చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ యూనిఫార్మ్ ధరించి సచివాలయంలోకి ప్రవేశించాడు.

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో తాను ఒకడినని నటిస్తూ సచివాలయంలో రవి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడు కరుడుగట్టిన ఫేక్ పోలీస్ అని గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి పోలీస్ యూనిఫార్మ్ మరియు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా సచివాలయం లాంటి అత్యంత భద్రత ఉండే చోట ఇలాంటి వ్యక్తులు చొరబడటం భద్రతా వైఫల్యాలపై కూడా చర్చకు దారితీస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions