Anant Ambani To Take Care Of Colombia hippos | కొలంబియా ప్రభుత్వం సుమారు 80 హిప్పోలను చంపేయాలని (Culling) తీసుకున్న నిర్ణయంపై అనంత్ అంబానీ స్పందించారు.
“ఆ హిప్పోలు ఎక్కడ పుట్టాలో అవి ఎంచుకోలేదు, ప్రస్తుత పరిస్థితులకు అవి బాధ్యులు కావు” అని ఆయన పేర్కొన్నారు.
వాటికి ‘వంతారా’లో శాశ్వత నివాసం కల్పించేందుకు సిద్ధమని కొలంబియా పర్యావరణ శాఖ మంత్రికి అధికారికంగా లేఖ రాశారు.
కేవలం తీసుకురావడమే కాకుండా, వాటిని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన వెటర్నరీ నిపుణులు, రవాణా సౌకర్యాలు మరియు బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ తో కూడిన సమగ్ర ప్రణాళికను కూడా ఆయన సిద్ధం చేశారు.
వంతారాలో ప్రత్యేక ఆవాసం.. గుజరాత్ లోని వంతారాలో ఈ హిప్పోల కోసం అవి ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్న సహజ ఆవరణను పోలి ఉండేలా ప్రత్యేకమైన వాతావరణాన్ని నిర్మించనున్నట్లు వంతారా సీఈఓ వివరించారు.
పాబ్లో ఎస్కోబార్ కాలం నాటి ఈ హిప్పోలు ఇప్పుడు 200 వరకు చేరుకున్నాయి. ఇవి స్థానిక జీవవైవిధ్యానికి మరియు ప్రజలకు ముప్పుగా మారడంతో కొలంబియా ప్రభుత్వం వీటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.







