SRH Vs MI | వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.
క్షేత్రస్థాయిలో ముంబయి ఆటగాళ్ల అశ్రద్ధ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు వరంగా మారింది.
ఈ మ్యాచ్‌లో ముంబయిని ఓడించిన హైదరాబాద్, రికార్డు స్థాయి ఛేజింగ్‌తో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ట్రావిస్ హెడ్, ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అయితే, అతడు కేవలం 20 పరుగుల వద్ద ఉన్నప్పుడే ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి కీపర్ రియన్ రికిల్టన్ చేతుల్లో పడింది.
విచిత్రమేమిటంటే, ముంబయి ఆటగాళ్లెవరూ అప్పీల్ చేయలేదు, కనీసం రివ్యూ కూడా కోరలేదు. దీనికి తోడు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ డ్రాప్ చేయడంతో హెడ్‌కు మరో లైఫ్ లైన్ దక్కింది.
వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న హెడ్.. కేవలం 30 బంతుల్లోనే 76 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ హైదరాబాద్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. దీంతో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ సునాయాసంగా ఛేదించింది.
అభిమానుల ఆగ్రహం…
ముంబయి ఇండియన్స్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “బంతి ఎడ్జ్ తగిలినా అప్పీల్ చేయకపోవడం, క్యాచ్‌లు వదిలేయడం ఏంటి?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ముంబయి చేసిన చిన్న చిన్న పొరపాట్లు చివరకు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







