Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రియాంక చోప్రా..న్యూ జర్నీ పై పోస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రియాంక చోప్రా..న్యూ జర్నీ పై పోస్ట్

Priyanka Chopra Visits Hyderabad’s Chilkur Balaji Temple | ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) ఇటీవలే అమెరికా లోని లాస్ ఏంజెలెస్ ( Los Angeles ) నుండి హైదరాబాద్ కు వచ్చిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూ జర్నీ ( New Journey )ని మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే నూతన ప్రయాణం దేనికోసమో అనేది మాత్రం చెప్పలేదు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )- దర్శకధీరుడు రాజమౌళి ( Rajamouli ) కాంబోలో నూతన చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ప్రియాంక చోప్రా కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

షూటింగ్ కోసమే ఆమె అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. న్యూ జర్నీ అనేది కూడా SSMB29 కి సంబంధించినదే కావొచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

You may also like
22మంది పిల్లల్ని దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ
‘ఆపరేషన్ మహాదేవ్..ఆ ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులే’
బీసీ రిజర్వేషన్లు..కవిత 72 గంటల నిరాహార దీక్ష
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. రాష్ట్రపతిని కలుద్దాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions