Friday 4th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

Pawan Kalyan Review Meeting On Floods | వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు, ఇంజిరీనింగ్ విభాగం బృందాలుగా వెళ్ళి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణ చేయడంతోపాటు ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించడంతోపాటు, డ్రైనేజీలు శుభ్రం చేసి నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు.

తాగు నీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

You may also like
naga babu
పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నాగబాబు ఏమన్నారంటే !
తమిళ హీరోకు పవన్ హెచ్చరిక..అసలు హీరో కార్తీ ఏమన్నారంటే !
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..షూటింగ్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్
ప్రపంచ రికార్డ్ అందుకున్న పవన్ కళ్యాణ్ శాఖ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions