Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > వరద బాధితుల కోసం..ర్యాపిడో బైక్ డ్రైవర్ సహాయం

వరద బాధితుల కోసం..ర్యాపిడో బైక్ డ్రైవర్ సహాయం

Rapido Bike Driver Donates For Flood Victims | తెలంగాణలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వరదల బీభత్సం కారణంగా ఖమ్మం ( Khammam ), మహబూబాబాద్ ( Mahabubabad )జిలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.

దింతో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలు బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ ర్యాపిడో డ్రైవర్ ( Rapido Driver ) తన ఉదార మనసునుచాటుకున్నారు. వరద బాధితుల కోసం తన ఒకరోజు సంపాదనను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు.

హైదరాబాద్ ఎల్బీ నగర్ ( LB Nagar ) పరిధి చంపాపేట్ కు చెందిన సాయి ప్రసాద్ ( Sai Prasad )అనే వ్యక్తి ర్యాపిడో లో బైక్ నడిపిస్తుంటాడు. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు బైక్ నడిపి రూ.780ని సంపాదించాడు.

ఆ రోజు మొత్తం సంపాదనను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. సాయి ప్రసాద్ విరాళం పెద్ద మొత్తం కాకపోయినా, అతని ఉదార మనసు అందర్నీ ఆలోచించేలా చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయి ప్రసాద్ ను అభినందిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions