Sunday 1st November 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరేసిన బీఆరెస్ మహిళా ఎమ్మెల్యే

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరేసిన బీఆరెస్ మహిళా ఎమ్మెల్యే

BRS MLA Kova Laxmi Throws Water Bottle On Congress Leader | కాంగ్రెస్ నేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆరెస్ మహిళా ఎమ్మెల్యే వాటర్ బాటిల్ ను విసిరేశారు.

కొమరంభీం జిల్లా జన్కపూర్ లో గురువారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం రసాభాసగా జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆరెస్ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

దింతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వాగ్వాదం సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే లక్ష్మీ వాటర్ బాటిల్ ను కాంగ్రెస్ నాయకుడిపై విసిరేశారు.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions