Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > సస్పెన్స్ కు తెర..తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్

సస్పెన్స్ కు తెర..తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్

Telangana PCC Chief Mahesh Kumar Goud | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన్నపటి నుండి నూతన పీసీసీ చీఫ్ ( PCC Chief ) ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరిగింది.

తాజాగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ( MLC Mahesh Kumar Goud ) ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ( KC Venugopal ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పీసీసీ చీఫ్ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు పోటీపడ్డారు.

అయినప్పటికీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. పార్టీలోకి కీలక నేతలకు సన్నిహితంగా ఉండడం, వివాదారహితుడిగా మహేష్ కుమార్ కు పేరు ఉంది.

జులై 7న పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ ( Cm Revanth ) పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం లభించింది.

You may also like
సీఎం రేవంత్ ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ దంపతులు
ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు
వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions