Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అశోక్ గజపతిరాజుకు సిగరెట్ అంటే సరదా..ఎలా మానేశారంటే!

అశోక్ గజపతిరాజుకు సిగరెట్ అంటే సరదా..ఎలా మానేశారంటే!

Cm Chandrababu News | సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. గోవా గవర్నర్ గా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు సిగరెట్ వ్యాసనాన్ని ఎలా మానేశారు చెప్పారు.

ఈ మేరకు సింగపూర్ లో ప్రవాస తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 1995 నుంచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఈ సమయంలో అశోక్ గజపతిరాజు ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే ఈ సమయంలో గజపతిరాజు సిగరెట్ తాగేవారని, అది ఆయనకు సరదా అని చంద్రబాబు చెప్పారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిగరెట్ మానేయాలని చాలా సార్లు గజపతిరాజుకు సూచించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒకానొక సమయంలో తనతో పాటు ఆర్ధికమంత్రి హోదాలో గజపతిరాజు సింగపూర్ పర్యటనకు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన సిగరెట్ ను మానేశారని తెలిపారు. ఎందుకని అడగగా ‘సింగపూర్ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే 500 డాలర్ల జారిమాన విధిస్తారు. నేను తెచ్చుకుందే 500 డాలర్లు. జరిమానా ఎలా కట్టాలి’ అని గజపతిరాజు తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఇది సింగపూర్ దేశ శక్తి అని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions