Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు..కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు

ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు..కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు

BJP Congress Clash In Nampally | హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబహికి దిగారు.

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే. తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామని ఆయన కాంట్రావెర్షియల్ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీక్ ముట్టడికి పిలుపునిచ్చింది. దింతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు.

ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీక్ పైకి టమోటాలు, గుడ్లను విసిరేశారు. ప్రతిస్పందనగా బీజేపీ కార్యకర్తలు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటబడ్డారు. ఈ సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions