Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ఖజానా జ్యువెలరీలో చోరీ..రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ

ఖజానా జ్యువెలరీలో చోరీ..రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ

Madhapur DCP Vineeth Explained about Khazana Jewellery Shop Theft | హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షోరూంలో చోరీ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.

పట్టపగలే దొంగలు తుపాకీలతో రెచ్చిపోవడం కలకలం రేపింది. తాజగా ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ పని చేసింది బీహార్ ముఠానే అని, అయితే వీరు హైదరాబాద్ లో చేసిన తొలి చోరీ ఇదే అని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వివరించారు. దోపిడీకి మొత్తం ఏడుగురు వచ్చినట్లు చెప్పారు. చోరీ కంటే ముందు సుమారు 20 రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. నకిలీ నంబర్ ప్లేట్లు గల బైక్ లపై వచ్చిన దొంగలు, ఖజానా జ్యువెలరీలోకి చొరబడి 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారని డీసీపీ పేర్కొన్నారు.

ఆ తర్వాత బైక్ ల నంబర్ ప్లేట్లు మార్చి పారిపోయినట్లు తెలిపారు. ఇదే ముఠా గతంలో బీహార్, కోల్కత్త, కర్ణాటకలో దోపిడీలు చేసినట్లు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు వివరించారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం చోరీ చేశారని మాదాపూర్ డీసీపీ మీడియాతో చెప్పారు.

దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారి నుండి నాటు తుపాకీలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్ర కూలీలను నియమించుకునే వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా డీసీపీ సూచించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions