one lakh trees were uprooted due to the tornado in Mulugu | ములుగు ( Mulugu ) జిల్లా తాడ్వాయి మండలం పసర, తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ ( Forest Range ) లో గాలివాన భీభస్తానికి ఏకంగా లక్ష చెట్లు ( One Lakh Trees )నేలకొరిగాయి. దింతో అటవీశాఖ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ ఘటన పట్ల స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ( Minister Seethakka )ఆరా తీశారు. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్‌లో మాట్లాడారు. లక్ష వరకు చెట్లు నేలకూలి భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు సీతక్క వెల్లడించారు. డ్రోన్ ( Drone ) కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
సుడిగాలి అడవిలో వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదని, సమక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని, తల్లుల దీవెనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారన్నారు.
చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ( Kishan Reddy ), బండి సంజయ్ ( Bandi Sanjay )ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.