Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!

అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!

Deputy Cm Pawan Kalyan Vizianagaram Tour | విజయనగరం ( Vizianagaram ) జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలిసి, పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏడుగురు మృతి చెందడం విచారకరమని, పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు.

సీఎం చంద్రబాబుతో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుద్ధి చేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా ‘జల జీవన్ మిషన్’ ( Jal Jeevan Mission ) పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలియజేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions