Court Sentences 3 Months Jail To RGV | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి చెక్ బౌన్స్ కేసును వేశారు. అయితే అప్పటినుండి ఆర్జీవి ఒక్కసారి కూడా విచారణకు హాజరవ్వలేదు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.మరోవైపు మూడు నెలల జైల్ శిక్ష విధించడమే కాకుండా ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లో రూ.3.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
పరిహారం చెల్లించలేని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విదిస్తామని కోర్టు స్పష్టం చేసింది.