CM Chandrababu Meets Bill Gates At WEF | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ ( Microsoft ) వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ( Bill Gates ) తో భేటీ అయ్యారు.
దావోస్ ( Davos ) లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( WEF )లో చంద్రబాబు పాల్గొని వివిధ కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో బిల్ గేట్స్ తో బుధవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏఐ ( Artificial Intelligence )లో సహకారం అందించాలని బిల్ గేట్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయం ( AI University ) కోసం నియమించిన సలహామండలిలో భాగస్వాములు కావాలని సీఎం ఆహ్వానించారు.
అలాగే బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలుచేస్తున్న హెల్త్ డ్యాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1995లో ఐటీ..ఇప్పుడు 2025లో ఏఐ అంటూ గత సమావేశాన్ని ప్రస్తుత సమావేశాన్ని పోలుస్తూ ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.