Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీ హిందువు కాదు: లాలూ యాదవ్ సంచలనం

మోదీ హిందువు కాదు: లాలూ యాదవ్ సంచలనం

Lalu Yadav On Modi| మాజీ కేంద్రమంత్రి, ఆర్జేడీ ( Rjd ) జాతీయ అధ్యక్షులు లాలూ యాదవ్ ( Lalu Prasad Yadav ) ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం బీహార్ ( Bihar ) రాజధాని పాట్నా లోని గాంధీ మైదానం లో ఇండి కూటమి ఆధ్వర్యంలో జరిగిన జనవిశ్వాస్ ర్యాలీలో పాల్గొన్నారు లాలూ యాదవ్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తల్లి మరణిస్తే మోదీ ( Pm Modi ) శిరోముండనం ( గుండు గీయించుకోవడం ) చేసుకోలేదన్నారు. కానీ హిందు సాంప్రదాయం ప్రకారం తల్లి మరణిస్తే ఎవరైనా గుండు గీయించుకుంటారని తెలిపారు. ఈ లెక్కన మోదీ హిందువు కాదని వ్యాఖ్యానించారు లాలూ ప్రసాద్.

అంతేకాకుండా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సంతానము లేని మోదీ కుటుంబ రాజకీయాల గురుంచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండీ ( India ) కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions