Mega 158 Launch | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు.
బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘Mega 158’ ఈ ఉదయం హైదరాబాద్‌లో భారీ ఎత్తున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఒక రేర్ అండ్ మెగా మూమెంట్ చోటుచేసుకుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి.. మెగాస్టార్‌పై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికపై పక్కపక్కనే నవ్వుతూ కనిపించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.
‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్…
మెగాస్టార్‌కు ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో వందల కోట్ల భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన మాస్ డైరెక్టర్ బాబీ.. ఈ సినిమాతో మరోసారి చిరంజీవిని అల్టిమేట్ మాస్ లుక్‌లో చూపించబోతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కోన వెంకట్ అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ అందించగా.. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇండస్ట్రీలోని పలువురు టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు.
ఈ నెల నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
స్లిమ్ లుక్‌లో మెగాస్టార్..
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తన లుక్‌పై ప్రత్యేకంగా వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు ఆయన గణనీయంగా బరువు తగ్గి.. ఎంతో స్టైలిష్ అండ్ ఫిట్ లుక్‌లోకి మారడం విశేషం.
పూజా కార్యక్రమంలో చిరు నయా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న KVN ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
మెగాస్టార్ మార్క్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, బాబీ మార్క్ మాస్ ఎలివేషన్స్ కలబోసి ఈ వింటేజ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.







