Commenting On Women’s Body Shape Constitutes Sexual Harassment | మహిళల బాడీ షేప్ ( Shape ) మరియు స్ట్రక్చర్ ( Structure ) పై కామెంట్లు చేసినా అది లైంగికవేధింపుల కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటి బోర్డు ( Kerala Electricity Board ) మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్ ( Petition ) పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతిపై అసభ్య కామెంట్లు చేయడం అంటే ఉద్దేశ్యపూర్వకంగా వారి గౌరవానికి భంగం కలిగించడమే అని న్యాయస్థానం పేర్కొంది.
ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసే ఉద్యోగి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013 నుండి అసభ్యకరంగా దూషిస్తున్నాడని, ఆ తర్వాత అభ్యంతరకర రీతిలో మెసేజీలు, వాయిస్ కాల్స్ చేసి వేధించినట్లు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా తన బాడీ షేప్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేదించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు కేసును నమోదు చేయగా, కేసును కొట్టివేయాలని సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ పై విచారణ సందర్భంగా మహిళల శరీరాకృతి పై కామెంట్లు చేసినా అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.