Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > ‘బలగం’ పాటకు జాతీయ అవార్డు..’తెలంగాణకు గర్వ కారణం’

‘బలగం’ పాటకు జాతీయ అవార్డు..’తెలంగాణకు గర్వ కారణం’

KTR congratulates ‘Balagam’ movie team on National Award win | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెల్సిందే.

బెస్ట్ లిరిక్స్ విభాగంలో ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

బలగం సినిమాలోని పాటకు గాను జాతీయ అవార్డు సాధించిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కు, బలగం టీమ్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని పల్లెవాసనకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కడం నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

దూరమవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన గొప్ప సినిమాలోని ‘ఊరు – పల్లెటూరు’ పాట కుటుంబాలను ఏకం చేయడమే కాదు మూడు తరాలను దగ్గర చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “బలగం”లోని ప్రతి ఒక్క సభ్యునికి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions