Niharika Political Entry| జనసేన ( Janasena ) ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Nagababu ) కుమార్తె, నటి నిహారిక ( Niharika ) త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ ( Tirupati Assembly ) నుండి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు నాగబాబు తనయుడు, నటుడు వరుణ్ తేజ్ ( Varun Tej ). తన మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ( Operation Valentine ) ప్రోమోషన్లో భాగంగా గురువారం రాజమండ్రిలో పర్యటించారు వరుణ్ తేజ్.
ఈ సందర్భంగా మీడియా ( Media )తో మాట్లాడుతూ..ఎన్నికల్లో జనసేన తరఫున తన ప్రచారం పై పెద్దల నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు.
పెద్ద నాన్న చిరంజీవి ( Chiranjeevi ), నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఏది చెప్తే అది చేస్తామని పేర్కొన్నారు. తమ అవసరం ఉందంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తానని తెలిపారు.
ఇక మెగా కుటుంబం ( Mega Family ) మొత్తం బాబాయ్ పవన్ వెంట ఉందన్నారు. అలాగే అనకాపల్లి నుండి నాగబాబు పోటీ చేస్తే ప్రచారం గురుంచి ఆలోచిస్తానని చెప్పారు.
ఈ క్రమంలో నిహారిక తిరుపతి నుండి పోటీ చేస్తారు అనే ప్రచారం పై స్పందించిన వరుణ్ తేజ్..అందులో నిజం లేదని కొట్టిపారేశారు.