Cm Revanth Reddy| సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు రూ.500 కే గ్యాస్ సిలిండర్ ( Gas Cylinder ) పథకాలు త్వరలోనే అమలు కానున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 27 లేదా 29 న ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ ( Cabinet ) సబ్ కమిటీ ( Sub Committee ) భేటీ జరిగింది.
ఈ భేటీలో సీఎం రేవంత్ ( Cm Revanth ), డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..మార్చి నెల నుండి విద్యుత్ బిల్లులు జారీ చేసే సమయంలో తెల్ల రేషన్ కార్డు ఉండే అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు సీఎం.
ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రూ.500 కె గ్యాస్ సీలిండర్ ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం.