Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > “ఆయన ప్రోద్బలంతోనే సీఎంను కలిశారు” రఘునందన్ కీలక వ్యాఖ్యలు!

“ఆయన ప్రోద్బలంతోనే సీఎంను కలిశారు” రఘునందన్ కీలక వ్యాఖ్యలు!

Raghunandan Rao

BJP Raghunandan Rao | బీఆరెస్ (BRS)పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసిన విషయం తెల్సిందే. ఈ అంశంపై రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. దీంతో బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలవడం పట్ల క్లారిటీ ఇచ్చారు.

నియోజకవర్గ సమస్యలు, ప్రొటోకాల్ విషయంలోనే సీఎంను కలిశామని వెల్లడించారు. తమకెవరికీ పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు (BJP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.  బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రోద్బలంతోనే బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిసినట్లు ఆరోపించారు.

Read Also: “సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కారణమిదే” బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha) మెదక్ పార్లమెంట్ సీటు కోసం బీఆరెస్ అధినేత కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్న విషయం తెలుసుకున్న హరీష్ రావు, బ్లాక్ మెయిల్ చేయడానికే  ఆ నలుగురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు పంపించినట్లు ఆరోపించారు.

కానీ ఇప్పడు దీనిని కప్పిపుచ్చుకోవడానికే ప్రోటోకాల్ విషయంలో సీఎం ను కలిసినట్లు వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ బిగ్ జీరో కాబోతుందని, ఆ పార్టీకి ఓటు వేస్తే హుస్సేన్ సాగర్ లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions