Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘హైదరాబాద్ లో లక్ష 40 వేల గణేశుడి విగ్రహాలు’

‘హైదరాబాద్ లో లక్ష 40 వేల గణేశుడి విగ్రహాలు’

CM Revanth Reddy offers prayers at Khairatabad Ganesh | హైదరాబాద్‌లో 1 లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ మేరకు ఆయన శుక్రవారం ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నగర చరిత్రలో గడిచిన 71 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులను అభినందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా నగరంలో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖలు తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందనని సీఎం హర్షం వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions