Wednesday 20th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడు పాలిటిక్స్.. మిత్రపక్షాల ఒత్తిడికి లొంగిన సీఎం విజయ్!

తమిళనాడు పాలిటిక్స్.. మిత్రపక్షాల ఒత్తిడికి లొంగిన సీఎం విజయ్!

cm vijay

– ఏఐఏడీఎంకే తిరుగుబాటు నేతలకు నో క్యాబినెట్ బర్త్..
– వీసీకే చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

CM Vijay Tamil Nadu cabinet expansion 2026 | టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకే (AIADMK) తిరుగుబాటు (రెబెల్) ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో మంత్రి పదవులు దక్కబోతున్నాయనే ప్రచారంపై మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో సీఎం విజయ్ (CM Vijay) తన అలియన్స్ పార్ట్‌నర్స్‌ కు కీలక భరోసా ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో ఎలాంటి చోటు కల్పించడం లేదని టీవీకే స్పష్టం చేసింది.

మద్దతు ఉపసంహరించుకుంటాం.. వీసీకే చీఫ్ హెచ్చరిక..
ఈ వివాదంపై వీసీకే (VCK) అధినేత తోల్ తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఒకవేళ టీవీకే గనుక ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గాన్ని ఆహ్వానించి, వారికి మంత్రి పదవులు ఇస్తే.. మేము ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుందని కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశాం.

అయితే, ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు ఏవీ జరగడం లేదని, రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని టీవీకే అధిష్ఠానం నుండి మాకు అధికారికంగా స్పష్టమైన హామీ లభించింది” అని ఆయన వెల్లడించారు.

మరోవైపు సీపీఐ(ఎం) కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో అధికార భాగస్వామ్యాన్ని (Power-Sharing) తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

1967 తర్వాత తొలిసారి అధికార భాగస్వామ్యం..
టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం కాబోతోందని పేర్కొన్నారు. “తమిళనాడులో 1967 తర్వాత ఒకే పార్టీ కాకుండా మిత్రపక్షాలతో కలిసి అధికార భాగస్వామ్యం (Power-Sharing) చేసుకోవడం ఇదే మొదటిసారి” అని ఆధవ్ అర్జున స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు పచ్చజెండా..
 
సామాజిక న్యాయం కోసం నిలబడి, టీవీకే ప్రభుత్వానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని క్యాబినెట్‌లోకి ఆహ్వానించాలని సీఎం విజయ్ స్వయంగా పట్టుబట్టారని, ఈ విస్తరణలో కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలిపారు.

ఇతర మిత్రపక్షాలకు ఆహ్వానం..
ప్రభుత్వానికి వెలుపల నుండి మద్దతు ఇవ్వాలనే లెఫ్ట్ పార్టీల నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలను కూడా మంత్రివర్గంలో చేరాలని టీవీకే ఆహ్వానించింది.

34 మందితో జంబో క్యాబినెట్?
మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. తనతో పాటు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగోట్టయన్ సహా 9 మంది మంత్రులతో తొలి విడత పాలన ప్రారంభించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరియు కీలక పరిపాలనా నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో ఈ వారంలోనే పూర్తిస్థాయి క్యాబినెట్ విస్తరణ జరగనుంది.

పెరగనున్న క్యాబినెట్ బలం..
రాబోయే విస్తరణతో తమిళనాడు మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34 కి చేరే అవకాశం ఉంది. కీలకమైన పోర్ట్‌ ఫోలియోలను టీవీకే తన వద్దే ఉంచుకుంటూ.. మిత్రపక్షాల సమీకరణాలు, కుల, ప్రాంతీయ ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేయనుంది.

విక్రవాండి సభ హామీ..
గతంలో విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి బహిరంగ సభలోనే.. తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అన్ని పార్టీలకు పరిపాలనలో తగిన ప్రాధాన్యత ఇస్తామని విజయ్ ప్రామిస్ చేశారు. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకుంటూ కూటమి చర్చలు జరుపుతున్నారు.

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం..
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నై రాజ్‌భవన్‌లో జరగనుండగా.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions