Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > ‘హాయ్ నాన్న’ అంటూ పలకరించిన ‘సీత’.. నాని కొత్త సినిమా టైటిల్ ఇదే!

‘హాయ్ నాన్న’ అంటూ పలకరించిన ‘సీత’.. నాని కొత్త సినిమా టైటిల్ ఇదే!

Nani and Mrunal

Nani Mrunal Movie Title | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఇటీవల కాలంలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఆయన చివరి చిత్రం దసరా (Dasara Movie)లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల మెప్పు పొందారు.  

ప్రస్తుతం నాని మరో పాన్ ఇండియా సినిమాతో రానున్నాడు. ఈసారి తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నారు.

నాని సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జతకట్టిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రామిస్ చేసినట్లుగానే మేకర్స్ గురువారం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ ను ఆవిష్కరించారు.

ఈ చిత్రానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో హాయ్ నాన్నా (Hi Nanna) అనే ఆహ్లాదకరమైన టైటిల్‌ను పెట్టారు.

హిందీలో హాయ్ పాపా (Hi Papa) అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఫస్ట్‌ లుక్ పోస్టర్ టైటిల్ మాదిరిగానే ఆకట్టుకునేలా ఉంది.

నాని భుజాలపై కూర్చున్న పాప వారి వెనుక నిలబడిన మృణాల్‌కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నాని, మృణాల్ ఇద్దరూ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని కనిపిస్తున్నారు.

నాని బిజీబిజీగా కనిపిస్తుండగా, మృణాల్ తన ముఖంపై అందమైన చిరునవ్వుతో పాప ఇచ్చే ముద్దును పట్టుకున్నట్టు కనిపిస్తోంది.

నాని లిటిల్ ప్రిన్సెస్ లుక్స్ చాలా అందంగా ఉన్నాయి. సాధారణ వస్త్రధారణలో, నాని దసరా సినిమాలోని ఉంగరాల జుట్టు, లేత గడ్డంతో క్లాసీ లుక్‌లో ఉన్నాడు.

బటన్-డౌన్ మ్యాక్సీ డ్రెస్‌లో మృణాల్ ఇక్కడ చూడముచ్చటగా కనిపిస్తోంది. గ్లింప్స్ లో పాప సినిమాలోని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీట్ మై ఫ్రెండ్ యష్ణ అంటూ మృణాల్ ని పరిచయం చేస్తుంది.

ఆ తర్వాత నాని కనిపించినప్పుడు మా నాన్న అని వాయిస్ వినిపిస్తుంది. సన్నివేశం వచ్చేటప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ గా ఉంటుంది.

చివరగా, ముగ్గురూ లంచ్ కోసం కలుస్తారు. మృణాల్ తనను తాను నానికి పరిచయం చేసుకుని, ఆపై అతన్ని హాయ్ నాన్నా అని పిలవడంతో గ్లింప్స్ ముగుస్తుంది.

ఈ సినిమాను, 2023 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

You may also like
కోట శ్రీనివాసరావు ఇకలేరు
AA 22..నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్ ?
నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
‘మైసా’ గా రష్మీక మందన్న..ఫస్ట్ లుక్ వైరల్ !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions