CM Revanth Reddy Makes Puris For Grandson | రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా, సమీక్షలు, పర్యటనలతో బిజీగా గడిపే తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.. తాజాగా తనలోని ఒక ఆత్మీయమైన ‘తాత’ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు.
నిత్యం రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలతో సతమతమయ్యే ఆయన.. తన మనవడి కోరిక మేరకు స్వయంగా వంటగదిలోకి ప్రవేశించి పూరీలు వండారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయగా, అది నెట్టంట వైరల్‌గా మారింది.
ఆ వీడియోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు. “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు… బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు.. అంటూ రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి.
Read Also: ‘బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అక్రమ సొమ్ము’
సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా..
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా కనిపించే రేవంత్ రెడ్డి.. ఇంట్లో ఒక సాదాసీదా తాతలా మారి మనవడి కోసం గుండ్రంగా రాకపోయినా ప్రేమతో డజన్ పూరీలు లటకాయించడం చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
“ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా.. మనవడి ముందర తాత ఎప్పుడూ తాతే”, “చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ సీఎం సార్” అంటూ ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.











